జూన్ 1 న రాబోతున్న విశాల్ “అభిమన్యుడు”

28
Vishal’s Abhimanyudu Gets A New Release Date?

మాస్ హీరో విశాల్ తాజా చిత్రం “అభిమన్యుడు”. మిత్రన్ దర్శకత్వం లో విశాల ఫిలిం బ్యానర్ ఫై విశాల నిర్మాత గా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. సమంత విశాల్ సరసన నటించింది. ఈ మధ్యనే తమిళ్ లో “ఇరుంబుతెరై” పేరు తో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకుంది. తమిళ్ లో విశాల్ కెరిర్ లోనే సూపర్ హిట్ చిత్రం గా నిలిచింది. తెలుగు లోకూడా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొట్టాలి అని విశాల్ చూస్తున్నాడు.

Vishal’s Abhimanyudu Gets A New Release Date?

ఇప్పుడు తెలుగు లో జూన్ 1 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రాన్ని తెలుగు లో హరి వెంకటేశ్వర బ్యానర్ ఫై నిర్మాత హరి రిలీజ్ చేస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఈ నెల 25 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ వేడుక కి ఒక ముఖ్య అతిధి రాబోతున్నాడు. ఆ అతిధి ఎవరు అనేది తెలియాల్సి ఉంది. యువన్ శంకర్ రాజ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ చిత్ర పాటలు రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్ అందుకుంటున్నాయి. ఈ చిత్రం లో ప్రధాన పాత్రలో విశాల్ , సమంత అక్కినేని తో పాటు అర్జున్ కూడా నటిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here