అంతా అవినీతిమయం : పవన్ కళ్యాణ్

36
జనసేన సభ లో మాట్లడిన ..పవన్ కళ్యాణ్..
టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతి,అక్రమాలతో కోట్లు సంపాదించుకుంటున్నారు .లారీ ఇసుక గతంలో 3 వేలకు దొరికేది. ప్రభుత్వానికీ ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు ఉచితం అంటూనే… లారీ ఇసుకను 15 వేలకు పెంచేశారు. 2019 లో మేం మీ వైపు ఎందుకు ఉండాలి ? అనో ప్రశ్నించాడు పవన్.మీరు దోపిడీ చేస్తుంటే చూస్తూ కూర్చునేందుకా ? లోకేశ్‌ అవినీతి మీ దృష్టికి వచ్చిందా ?ఎన్టీఆర్‌ మహానుభావుడని ….రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చాడని ఆదిలాబాద్‌లో ఒక వృద్ధురాలు చెప్పింది. మరి. ఆ మహానుభావుడి మనవడు లోకేష్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ? 2019 ఎన్నికల్లో జగన్‌ను ఎదుర్కొనేందుకు డబ్బులు కావాలని బరితెగించి అవినీతి చేస్తున్నారా ? నియోజకవర్గానికి 25  కోట్లు సిద్ధం చేశామని టీడీపీ నేతలు నిస్సిగ్గుగా చెబుతున్నారు. అటు ఇలా పలు ప్రశ్నలు సందించాడు.
ఇది చూసి టంగుటూరి ఎన్టీఆర్‌ ఆత్మలు క్షోభిస్తాయి అన్నారు. 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా ప్రధాని నరెంద్రమోది పట్టించుకోలేదని అంటున్నారు. మన బంగారం మంచి దై ఉండాలి కదా…. చెన్నై కాంట్రాక్టర్‌ శేఖర్‌ రెడ్డి కేసులో మీ అబ్బాయి పేరు ఉందని అందుకే ప్రధాని మిమ్మల్ని భయపెడుతున్నారని అంటున్నారు. ఇప్పుడు లక్షన్నర కోట్లకుపై గా బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ముఖ్యమైన హోదాపై నే మూడు మాటలు,ఆరు అబద్ధాలు గా చెప్పారు. ఇప్పుడు  బడ్జెట్‌ను నమ్మి ప్రజలు మీకు ఎలా ఓట్లు వేస్తారు ? అన్నీ మరిచిపోతారు అనుకుంటున్నారా? అని పవన్ అన్నారు. రాష్టం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ అవినీతిలో మొదటి స్తానం లో ఉంది  మనం కొత్త రాష్టం లో సాధించింది ఇదేనా అని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కి ఇదంతా తెలియదా ….ఆయన కు పార్టీ మీద ప్రభుత్వం మీద పట్టు లేదా ?… తెలిసే ఇదంతా జరుగుతోందా? 2019ఎన్నికలు మీకు 2014 ఎన్నికలంత సుఖంగా మాత్రం ఉండవు . ప్రజలు సరికొత్త నాయకుడిని పార్టీని ఎన్నుకుని తీరుతారు అని ఆయన జోస్త్యం చెప్పారు. ప్రతి 30 ఏళ్లకోసారి సామాజిక రాజకీయ మార్పులు జరుగుతాయని… ఇప్పుడు అది మొదలైందని ఆయన గుర్తు చేసారు.ఆంధ్రప్రదేశ్  రాజకీయ చిత్రపటం చాలా బలంగా మారబోతోందని
..సరికొత్త రాజకీయ వ్యవస్థ వస్తుందని ఆయన అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్నీ సంతృప్తి పరచలేదు అని పవన్ అన్నారు. నేటి నుంచి టీడీపీ ప్రభుత్వ వైఫల్యాల ని ఎండగడతాము అని పవన్ కళ్యాణ్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here