నెహ్రూ తాత లాగా.. మోదీ తాత : శివప్రసాద్

37

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంట్‌‌లోని గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీల చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతీరోజు వివిధ వేషధారణలతో నిరసన తెలుపుతున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఈరోజు స్కూల్ విద్యార్థి చిన్న పిల్లాడి వేషధారణ లో పార్లమెంటుకు వచ్చారు. స్కూల్ యూనిఫాం ధరించి , తలపై స్కూల్ బ్యాగు వేసుకుని, ఓ చేతిలో పుస్తకం,మరో చేతిలో పెన్సిల్, స్కేలు పట్టుకుని అచ్చం స్కూల్ విద్యార్థిగా ఆయన నిరసన తెలిపారు.

అన్ని వర్గాల ప్రజల ఆందోళన ఏ విధంగా ఉందో తాను ప్రతీ రోజు ఇలా ఒక్కో వేషధారణలో చూపిస్తున్నానని ఎంపీ శివప్రసాద్ తెలిపారు. ఇది ఎంతవరకు వెళ్లిదంటే చిన్న పిల్లలు ఒక చోట చేరితే..ఇదే విషయాన్ని మాట్లాడుకు నే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉందన్నారు. నెహ్రూ తాత ఎలాగో… నరేంద్ర మోదీ ని తాత అనాలని పిల్లల కోరిక అన్నారు. విభజన హామీలు అమలు చేసి మంచి అబ్బాయిగా మారాలని మోదీని ఎంపీ శివప్రసాద్ కోరారు.

mp siva

అదేవిధంగా …. చిన్నపిల్లాడి లా మాట్లాడుతూ ….మోదీ ఈజ్ ఏ బ్యాడ్ బాయ్…దేవాన్ష్, మేము ఓ టీంగా మారి కొట్టేత్తాం. ఎందుకమ్మా మాట తప్పావు…ఎందుకమ్మా ప్రత్యేక హోదా ఇవ్వవు. చంద్రబాబు తాత కష్టపడుతుంటే…నువ్వు నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఆగిపోదా అని అన్నారు. నరేంద్ర మోదీ తాత మంచి బాయ్‌గా మారాలి. మోదీ తాత మాట వినకపోతే చాక్లెట్ ఇవ్వను…మేమే తినేత్తాం…స్కేలు పెట్టి కొట్టేత్తాం.. పెన్సిల్‌ తో పేసంతా గీకేత్తా తెలుసునా…చేత్తావు కదా….చేయకపోతే మేమంతా నిన్ను ఓడించేత్తాం…ఆంధ్రా అంటే ఏం అనుకున్నావ్ జాగ్రత్త అంటూ చిన్నపిల్లలు ఎలా మాట్లడుకుంటారో అలా మాట్లడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here