మీరు మాత్రం ద్రోహం చేశారు : పవన్

44
జనసేన బహిరంగ సభకు ముఖ్య అతిథులు వస్తున్నారు అంటూ పవన్ అనగానే అందరు ఎవ్వరెవరో అని చూసారు… ఫాతిమా కాలేజీ ,ఉద్దానం కిడ్నీ,ఆక్వా పార్కు ఇలా పలు సమస్యలకు సంబంధించిన సుమారు పాతిక మంది బాధితులను పవన్‌ వేదికపైకి ఆహ్వానించారు. టీడీపీ వైఫల్యానికి వీరే నిదర్శనం అన్నారు. గత ఎన్నికల్లో అండగా నిలిస్తే… మీరు మాత్రం ద్రోహం చేశారు..అని ఆయన అన్నారు. ఒకవైపు అవినీతి,మరోవైపు న్యాయం కోసం పోరాటం చేస్తున్న వారిపై దాడులు… నైతికంగా ఇష్టం లేకున్నా పొలిటికల్‌ బాస్‌లు చెప్పిన పనులు చేయాల్సి వస్తోందని ఉన్నతాధికారులు వాపోతున్నారు అని ఆయన అన్నారు.
ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు మహిళా ఎమ్మార్వోపై దాడి చేశారు. ఆ ఎమ్మెల్యేకేమైనా కొమ్ములొచ్చాయా ? ఆయనకు మన చట్టం వర్తించదా ?సింగపూర్‌లాంటి రాజధాని అంటారు…. అదే సింగపూర్‌ లో ఇలా ఉద్యోగుల పై దాడి చేస్తే తోలు ఊడేలా లాఠీలతో కొడతారు అని గుర్తు చేసారు. మీరు మాత్రం అలాంటి ఎమ్మెల్యేను వెనుకేసుకొచ్చారు అని పవన్ అన్నారు. దీనివల్ల ప్రతి అధికారీ సర్దుకుపోదాంలే అని అనుకుంటారు అన్నారు. మా సహనాన్ని పరీక్షించవచద్దు పవన్. ఇసుకను,మట్టిని అడ్డగోలుగా తవ్వుకున్తున్నారు ….ఇలా చేస్తే భూ మాత ఊరుకుంటుందా ?భూమి అట్టడుగులో కి లాక్కెళుతుంది అని అన్నారు. ఉద్ధానం లో కిడ్నీ బాదితుల  సమస్య పరిష్కారం కోసం నేను రావాలా ?ఇది సిగ్గు చేటు కాదా ? అక్కడున్న ఎమ్మెల్యేలు,ఎంపీలు ఏమయ్యారు ? అని పవన్ కళ్యాణ్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here