తిరుమల గాలిగోపురం వద్ద భక్తుల రద్దీపై స్పందించిన చంద్రబాబు

25

భక్తుల రద్దీ పై మీడియాలో వార్తలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీసారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వెంటనే చేయాలి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలి, అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. భక్తుల రద్దీపై టిటిడి అధికారులతో, సీఎంవోతో సమీక్షించిన చంద్రబాబు భక్తుల రద్దీని ముందే అంచనా వేయాలి, దానికి తగ్గట్లుగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి అని తెలిపారు.

CM Chandrababu Naidu reacted on devotee floating at gali gopuram

స్వామివారి దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు భక్తులకు కలుగరాదు. ఎన్నో కష్టాల కోర్చి భక్తులు తిరుమల వస్తారు, కష్టాలు చెప్పుకునేందుకు స్వామివారి దర్శనానికి వస్తారు. భక్తుల సేవే స్వామివారి సేవగా సిబ్బంది, అధికారులు భావించాలి. మానవ సేవే మాధవ సేవ అని పెద్దలు ఎప్పుడో చెప్పారు, ఈ రోజు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారన్న అధికారులు టిక్కెట్ల కోసం భారీ సంఖ్యలో భక్తుల బారులు తీరారు. అందుకే సమస్య ఏర్పడిందన్న అధికారులు.14వేల టిక్కెట్లు ఇచ్చామని వివరించిన అధికారులు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వెంటనే చేయాలన్న ముఖ్యమంత్రి, మనం ఉంది భక్తుల సేవ కోసమే అనేది అందరూ గుర్తుంచుకోవాలి అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here