155 వ రోజుముగిసిన జగన్ ప్రజా సంకల్ప యాత్ర

52

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకము గా తీసుకోని చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర నేటి తో 155 వ రోజుకు చేరుకుంది..ఈ రోజు యాత్ర గుడివాడ నియోజకవర్గం లో జరిగింది …ఇందులో భాగంగా జగన్ పాదయాత్రలో భవన నిర్మాణ కార్మికులు కలిశారు..అక్కడ ఆయన మాట్లాడుతూ …నాన్నగారి హయాం లో జూన్‌ 26, 2007న అమల్లోకి తెచ్చిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు అని ఆయన అన్నారు...అలాగే కార్మికుల సంక్షేమాన్ని పక్కనపెట్టి సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఆ నిధులను వాడుకుంటున్నారు అని జగన్ మోహన్ రెడ్డి దుయ్యబట్టారు.

Day 155 of YS Jagan Padayatra Begins | Praja Sankalpa Yathra

ఆయన ఒక్క పైసా మంజూరు చేయకపోగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం వాడాల్సిన నిధులతో సొంత ప్రచారంపార్టీ ప్రచారం నిర్వహించుకుంటున్నారు అని అన్నారు. చంద్రన్న బీమాకు ముడిపెట్టి నిధులను మళ్లించుకుంటున్నారు. కార్మికుల సొమ్ముతో ఊరూరావాడవాడా ముఖ్యమంత్రిచంద్రబాబు..మంత్రుల ఫొటోలతో పార్టీ ప్రచారం నిర్వహించుకోవడం ఒక ఎత్తైయితే ఆ అడ్వర్టైజ్‌మెంట్‌ కాంట్రాక్టుల్లో సైతం కోట్ల రూపాయల కమీషన్లు కొల్లగొడుతున్నారు అని అన్నారు...   పథకాలకు నాలుగు వందల కోట్ల పైచిలుకు నిధులను మళ్లించుకోవడం అత్యంత దారుణం అని అన్నారు…. ఆ అధికారం ఈ ముఖ్యమంత్రిగారికి ఎవరిచ్చారు?’ ప్రజలు కదా ?  అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here