కర్నాటక ఉప ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు

38
Karnataka: Deputy CM Parameshwara Says Five-Year Term For Kumaraswamy Not Final

కన్నడనాట రసవత్తర రాజకీయాలు నడుస్తున్నాయి. కుమారస్వామి ప్రభుత్వం కాంగ్రెస్ మద్దతుతో ఏర్పాటయ్యాక అక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పడిందనే అందరూ భావించారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్దం అవుతున్నాడు. అయితే ఇప్పుడు జేడీఎస్, కాంగ్రెస్ కూటమికి 117సీట్లుండగా ఇప్పటికిప్పుడు ఆ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు కానీ ఈ ప్రభుత్వానికి రానున్న కాలంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది.

Karnataka: Deputy CM Parameshwara Says Five-Year Term For Kumaraswamy Not Final
తాజాగా కర్నాటక ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర మాట్లాడిన తీరు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తుంది. కుమారస్వామి ఐదేళ్ల పాటు సీఎంగా ఉంటాడని చెప్పలేమని, కుమారస్వామేమో కాంగ్రెస్ పార్టీతో సీఎం సీటును షేర్ చేసుకునే ప్రతిపాదన ఏమీ లేదని అంటుంటే, పరమేశ్వర మాత్రం కుమారస్వామికే ఐదేళ్లూ ఛాన్స్ లేదని అంటున్నాడు. కుమారస్వామిని వీళ్లు కాదనుకుంటే బీజేపీ ఈ పీఠాన్ని తన్నుకుపోగలదు. ఇంత జరుగుతున్నా.. కాంగ్రెస్ నేతలు ఇలా మాట్లాడుతున్నారంటే.. ఈ కూటమి ప్రభుత్వం భవితవ్యం ఏమిటనేది మాత్రం ఇప్పడు అర్థం కాని పరిస్థితి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here