దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో ఏసీ బస్టాప్‌ ప్రారంభించిన KTR

53

తెలంగాణా రాజదాని హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తిర్చదిడ్డడం లో భాగంగా  శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాల పరిధిలో తెలంగాణా ఐటి శాఖా మంత్రి వర్యులు కల్వకుంట్ల తారక రామారావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.     ఉదయం అయ్యప్ప సొసైటీ వద్ద జలమండలి ఆధ్వర్యంలో నిర్మించిన రిజర్వాయర్‌ను ఆయన కేటీఆర్ ప్రారంభం చేసారు. ఆ తరువాత శిల్పా రామం ఎదురుగా నిర్మించిన ఆధునిక ఏసీ బస్ షెల్టర్‌ను ఆయన ప్రారంభించారు.

Minister KTR Inaugurates AC Bus Shelter At Shilparamam

శిల్పారామం దగ్గర లగ్జరీ వాష్‌రూం, లూ కేఫ్‌ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి అలాగే మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు నేతలు , నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటిఆర్ మాట్లాడుతూ . దేశంలోనే తొలిసారిగా ఏసీ బస్టాప్‌ను ఏర్పాటు చేసి జీహెచ్‌ఎంసీ అరుదైన ఘనత సాదించింది అని ఆయన అన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Minister KTR Inaugurates AC Bus Shelter At Shilparamam

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here