పురుష కమిషన్‌ ఏర్పాటు చేయాల్సి వస్తుందేమో : నన్నపనేని రాజకుమారి

30
Nannapaneni Rajakumari Says commission for men is needed

డైలీ సీరియల్‌ ప్రభావంతో మహిళల్లో క్రూరత్వం పెరిగిపోతోందని, ఇదే పరిస్థితి కొనసాగితే పురుష కమిషన్‌ ఏర్పాటు చేయాల్సి వస్తుందేమోనని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులు, డైలీ సీరియల్‌ ప్రభావంపై స్పందించిన ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి వాటిపై సమాజం పట్టించుకోవాలని, చట్టాలు గట్టిగా ఉండాలని ఆకాంక్షించారు. ఇరుగు పొరుగువారు కూడా ఏం జరుగుతుందో గమనించాలని అన్నారు. ఆత్మ, ప్రాణ, మాన రక్షణ కోసం మహిళలు పోలీసులు వచ్చే వరకు ఎదురు చూడకుండా తనను తాను రక్షించుకోవడం కోసం లైంగిక వేధింపులకు పాల్పడే వ్యక్తిపై దాడి చేయాలని, కచ్చితంగా ఆయుధం తీసుకుని తిరగబడాల్సిందేనని నన్నపనేని అన్నారు.

Nannapaneni Rajakumari Says commission for men is needed

ఈ సందర్భంగా ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను ఆమె వివరించారు. అలాగే మహిళలు కూడా ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని భర్తలను కిరాయి గుండాలతో హతమారుస్తున్నారని నన్నపనేని అన్నారు. ఈ విధంగా మహిళలు పాల్పడ్డానికి కొన్ని చానల్స్‌లో వచ్చే డైలీ సీరియల్స్‌ ప్రభావం ఎంతో ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తంచేశారు. సీరియల్స్‌ చాలా దారుణంగా ఉంటున్నాయని, ఎక్కువగా మహిళలే విలన్‌ పాత్రలు పోషిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పురుష కమిషన్‌ కూడా వేయాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here