కుమార స్వామి సీఎం పోస్ట్… వన్ ఇయర్ వరకు నో ప్రాబ్లెమ్!!!

37
One Year Warranty for Kumaraswamy CM Post

78 సీట్ల కాంగ్రెస్ పార్టీ 37 సీట్లు గెలిచిన జేడీఎస్‌కు మద్దతు ఇవ్వడం ఏంటి? … బీజేపీ డ్రామా నేపథ్యంలో ఆ ఆశ్చర్యం కాస్త పక్కన పెట్టారు. ఇపుడదంతా ముగిసింది. ఎందుకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది? మద్దతు ఇవ్వడమే విచిత్రం అనుకుంటే అది కాంగ్రెస్ చరిత్రలో తీసుకున్న అత్యంత వేగవంతమయిన నిర్ణయాల్లో ఒకటిగా కూడా ఇది చరిత్రలో నిలిచిపోతుంది.

One Year Warranty for Kumaraswamy CM Post

దీనికి చాలా కారణాలు దొరికాయి. వాటినీ ఒక్కోటీ తెలుసుకుందాం.

1. మంత్రి పదవులు ఆఫర్ ఇస్తే జేడీఎస్ కచ్చితంగా సెంటర్లో అధికారంలో ఉన్న బీజేపీ వైపు చూస్తుంది కానీ తమ వైపు చూడదు. అందుకే ఏకంగా సీఎం సీటును ఇస్తే 104 సీట్లు గెలిచిన బీజేపీ ఎలాగూ జేడీఎస్‌కు ఆ ఆఫర్ ఇవ్వదు కాబట్టి చచ్చినట్టు కుమారస్వామి కాంగ్రెస్‌తో కలిసి నడుస్తాడు.

2. ఇపుడు కాంగ్రెస్‌కు మిగిలి ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక మాత్రమే లెక్కవేసుకోదగినంత పెద్ద పార్టీ. ఈ నేపథ్యంలో అది కూడా చేజారితే రాహుల్ ఇమేజ్ భారీగా పతనం అవుతుంది. కాబట్టి సీఎం సీటా- రాహుల్ పరువా అని చూసినపుడు రాహుల్ పరువే ముఖ్యం.

3. దక్షిణాదిలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న పెద్ద రాష్ట్రం ఈ ఒక్కటే. దేశంలో టాప్ 4 సిటీస్‌లో ఒకటైన బెంగుళూరు నగరం కర్ణాటకలో ఉన్న నేపథ్యంలో దాన్ని వదులుకోవడం ఇంకా పెద్ద నష్టం. అందుకే సీఎం కుమారస్వామి అయినా చెల్లుబాటు అయ్యేది కాంగ్రెస్ మాటే. కాబట్టి కచ్చితంగా ఈ రాష్ట్రం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిలో కాంగ్రెస్ తన ప్రభావం చూపడానికి ఇది చాలా కీలకం.

ఇవన్నీ ఒకెత్తు అయితే తన స్వలాభం కోసం సీఎం పోస్టును వదులుకున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నాళ్ల పాటు తన నిర్ణయానికి కట్టుబడి ఉంటుందన్నది ఇపుడు లక్ష వరహాల ప్రశ్న. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నంత అసంతృప్తి గ్రూపులు అంతర్గత ప్రజాస్వామ్యం ఇంకే పార్టీలో ఉండదు. సోనియా తలచుకుంటే వాటన్నింటినీ అదుపు చేయడం ఆ పార్టీకి పెద్ద విషయం కాదు. అయితే అసలు సోనియాకు ఐదేళ్లు కుమారస్వామిని కూర్చోబెట్టాల్సిన అవసరం ఉందా అని చూసినపుడు కచ్చితంగా లేదనే చెప్పాలి. వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు మాత్రం కుమారస్వామికి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఆ తర్వాతే కుమారస్వామికి అసలు పరీక్ష మొదలవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here