పవన్ కల్యాణ్ కొత్త టీవీ ఛానల్ ఖరారయ్యింది?

61
Pawan Kalyan Shocking Decision On New TV Channel

జనసేన అధిపతి పవన్ కల్యాణ్ చంద్రబాబుకు మద్దతు పలుకుతున్నంతసేపూ కొన్ని టీవీ చానళ్లు పవన్ కల్యాణ్ వార్తలను తెగ ప్రసారం చేశాయి. అయితే ఎప్పుడైతే పవన్ కల్యాణ్ చంద్రబాబుకు దూరం అయ్యాడో అక్కడ నుంచి ఆ చానళ్ల తీరు మారిపోయింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ ను అవి పట్టించుకోకపోవడమే కాదు.. పవన్ కు వ్యతిరేకంగా ఆ చానళ్లు చాలా మంత్రాంగం నడిపించాయని స్వయంగా పవన్ కల్యాణే చెప్పాడు.

Pawan Kalyan Shocking Decision On New TV Channel

తనకు వ్యతిరేకంగా మీడియా అధిపతులు కుట్ర చేశారని, లోకేష్ ఆధ్వర్యంలో ఆ కుట్ర జరిగిందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చాడు. ఆ మేరకు ట్వీట్లు చేశాడు. ఈ విధంగా మీడియాకు, పవన్ కల్యాణ్ కు మధ్యన వార్ మొదలైంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఇప్పుడు ఒక మీడియా సహకారం తీసుకోవాలని భావిస్తున్నాడట. సొంతంగా చానల్ పెట్టుకోవడం దాన్ని ప్రచారంలోకి తీసుకురావడం పవన్ కు ఇప్పుడుంత ఈజీ కాదు.

Pawan Kalyan Shocking Decision On New TV Channel

అందుకే రన్నింగ్ లో ఉన్న ఒక చానల్ ను సొంతం చేస్తున్నాడట పీకే. అది కమ్యూనిస్టుల చానల్ పైగా పవన్ కల్యాణ్ కు కమ్యూనిస్టులకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ చానళ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ తనకు తెలిసిన ఒక వ్యాపారవేత్త చేత కోట్ల రూపాయల పెట్టుబడులు ఆ టీవీ చానల్లో పెట్టిస్తున్నాడని.. తద్వారా దాన్ని తన అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని సమాచారం. తనకంటూ ఒక మీడియా సంస్థ సహకారం అవసరం అని పవన్ ఈ పని చేస్తున్నాడట. ఏకంగా ముప్పై కోట్ల రూపాయలు ఆ చానల్లో పెట్టించి.. అనుకూల మీడియా వర్గాన్ని ఏర్పాటు చేసుకొంటున్నాడట పవన్ కల్యాణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here