అక్రమాలకు అడ్డు లేకుండా పోతుంది – జనసేన అధినేత పవన్ కల్యాణ్

29
PawanKalyan Fires on TDP Govt during his Padayatra

తెలుగుదేశం పార్టీ నేతల అవినీతికి అంతేలేకుండా పోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఉత్తరాంధ్రలో అక్రమ మైనింగ్‌లు జరుగుతున్నాయని, కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి టీడీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. అవినీతికి ఆధారాలు చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం తనను అడుగుతోందని, టీడీపీ నేతలు తీసుకుంటున్న లంచాలకు ఎవరైనా రసీదులు ఇస్తారా అని పవన్ ప్రశ్నించారు. ఇసుక కనిపిస్తే చాలు కరకర నమిలి మింగేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు అదే ప్రజలను దోచుకుంటున్నాయని, 2019 ఎన్నికల్లో జనసేనకు అధికారమిస్తే సరికొత్త పాలనను అందిస్తామని హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here