ప్రధాని మోదీపై బయటపడ్డ కుట్ర

24
PM Narendra Modi Assassination Plot Revealed In Maoist Letter

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని హత్య చేసిన తరహాలో ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నారని పుణె పోలీసులు సంచలన విషయాన్ని వెల్లడించారు. సెషన్‌ కోర్టుకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ మేరకు అనుమానిత మావోయిస్టు నుంచి స్వాధీనం చేసుకున్న లేఖను పోలీసులు బహిర్గతం చేశారు. జనవరిలో జరిగిన భీమా-కోరేగావ్‌ ఘర్షణల కేసులో చేపట్టిన దర్యాప్తులో ఈ లేఖ బయటపడ్డట్లు తెలిపారు. దిల్లీకి చెందిన కార్యకర్త రోనా విల్సన్‌ ఇంట్లో సదరు లేఖ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. నిషేధిత సీపీఐ మావోయిస్ట్‌ దళిత్‌కు చెందిన అయిదుగురు కార్యకర్తలను పోలీసులు నిన్న అరెస్ట్‌ చేశారు. విచారణలో భాగంగా పలు విషయాలు వెల్లడయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here