ఢిల్లీ లో కేంద్రమంత్రి నితిన్ ని కలిసిన సంకినేని

37
T-BJP Leaders In Delhi To Talk About State Issues

జెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు ఈరోజు ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరి గారిని కలిసి
సిరివంచ టు రేణిగుంట( NH 365 ) జాతీయ రహదారిని మొదటి దశలో ఉన్న ప్రతిపాదనల పరంగా మార్చాలని దానివలన దూరం తగ్గి అన్ని వర్గాల ప్రజలకు జాతీయ రహదారి అందుబాటులోకి వస్తుందని తెలిపారు.దీనికి మంత్రిగారు సానుకూలంగా స్పందించడం జరిగింది

సిరివంచ — రేణిగుంట (NH 365 ) జాతీయ రహదారి

సంకినేని వెంకటేశ్వరరావు తుంగతుర్తి శాసన సభ్యునిగా ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ,వాజ్ పైయ్ ప్రధానమంత్రిగా ,విజయ రామారావు ( R&B) మంత్రి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపడం జరిగింది . సిరివంచ to రేణిగుంట ( NH 365 )
నర్సంపేట్ ,గూడూరు, కేససముద్రం ,నెల్లికుదురు, తొర్రూరు ,రావులపల్లి, తుంగతుర్తి మీదినుంచి నల్గొండ మీదుగా రేణిగుంట జాతీయ రహదారి ప్రతిపాదనలు పంపడం జరిగింది .సిరివంచ నుంచి రేణిగుంటకు ( వయా ) తుంగతుర్తి జాతీయ రహదారికి ప్రతిపాదనలు పంపడం జరిగింది .ఆరోజు ముందస్తు ఎన్నికల కారణంగా టెండర్లు పిలవలేక పోయినారు.

దీనిని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ కేంద్రమంత్రి అయిన తరువాత సిరివంచ టు రేణిగుంట జాతీయ రహదారిని నర్సంపేట్, మహబూబాబాద్ ,మరిపెడ, తానంచర్ల ,ఎర్రబాడు ,మద్దిరాల, తుంగతుర్తిల నుండి వెళ్ళడం వలన 50 కిలోమీటర్ల దూరం పెరుగుతుంది. నాలుగు లైన్ల రోడ్డు వేసి అన్ని వర్గాలవారికి జాతీయ రహదారులను అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ఉన్న మొదటి దశ ప్రతిపాదనను మార్చడం వలన 50 కిలోమీటర్ల దూరం పెరుగుతుంది .కాబట్టి సిరివంచ నుంచి బయలుదేరిన వాహనం రేణిగుంటకు డైరెక్టుగా వెళ్లలేదు.

BJP రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు ఈరోజు ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరి గారిని కలిసి
సిరివంచ టు రేణిగుంట( NH 365 ) జాతీయ రహదారిని మొదటి దశలో ఉన్న ప్రతిపాదనల పరంగా మార్చాలని దానివలన దూరం తగ్గి అన్ని వర్గాల ప్రజలకు జాతీయ రహదారి అందుబాటులోకి వస్తుందని తెలిపారు.దీనికి మంత్రిగారు సానుకూలంగా స్పందించడం జరిగింది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here