ఈ రోజుతో మోత్కుపల్లి చచ్చిపోయాడు : సండ్ర

26

ఎన్టీఆర్ వారసులం మేమే అని చెప్పుకుంటూ టిడిపి పై విషం కక్కుతున్న అతి నీచుడు మోత్కుపల్లి. ఈ రోజుతో టిడిపి కి, అతనికి సంబంధాలు తెగిపోయాయి, నల్గొండ జిల్లలో ఎంతో మంది ని బ్లాక్ మొయిల్ చేసి, వేధించాడు పైకి అధినేత పై ప్రేమ ఒలకపోస్తూ, లోపల పార్టీని నాశనం చేశాడు. చంద్రబాబు పై మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలను చూసి తెలంగాణ అంతా చీత్కరిస్తుంది. మోత్కుపల్లి మంచివాడైతే ఎన్ టి ఆర్ అప్పుడు ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదు. మోత్కుపల్లి నోటిదురుసు, అహంభావం వల్లే ఎన్టీఆర్ టిక్కెట్ ఇవ్వలేదు. తెలుగుదేశం కోసం మాట్లాడే అర్హత నీకు లేదు..

TDP MLA Sandra Venkata Veeraiah slams motkupalli
మోత్కుపల్లి కి గవర్నర్ పదవి ఇవ్వటం కోసం ఎంతో కృషి చేశాడు. నీకు పదవి రాలేదని, గవర్నర్ గిరి రాలేదని విమర్శిస్తున్నావు. టిడిపి ని టిఆర్ ఎస్ లో విలీనం చేయమని అన్నప్పుడే నువ్వు రాజకీయంగా చచ్చిపోయినట్టు, ఆ రోజే మీకు తెలంగాణ ప్రజలు మరణశాసనం విధించారు.. ఈ రోజు తెలుగుదేశం పై కుట్రలు పన్నుతున్న వైసిపి, బిజెపి, జనసేనలను పొగుడుతున్నావంటే ఎవరు నిన్ను ఆడిస్తున్నారో అర్ధమయ్యింది.. వేడుకగా సాగుతున్న మహానాడు ను విమర్శిస్తున్నావంటే నువ్వు ఎన్ టి ఆర్ గారి అభిమానివి కాదు, ఎంతమంది పార్టీని వదిలివెళ్లినా తెలంగాణ లో టిడిపి రేపరేపలాడుతుంది.. పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సిన పనిలేదు, ఈ రోజుతో మోత్కుపల్లి చచ్చిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here