వంచనపై గర్జన

49
VANCHANA PAI GARJANA DEEKSHA YSRCP

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పొందుపరచిన అంశాలను అమలు చేయని కోరుతూ ఇవాళ నెల్లూరులో ‘వంచనపై గర్జనను వైసీపీ నిర్వహిస్తోంది. నెల్లూరు వీఆర్‌ కళాశాల మైదానంలో జరిగే ‘వంచనపై గర్జన’ నిరాహార దీక్షకు పదవులకు రాజీనామాలు చేసిన ఐదుగురు వైఎస్సార్‌ సీపీ లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ ప్రాంతీయ కోఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు.

VANCHANA PAI GARJANA DEEKSHA YSRCP
అయితే, ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ ఎంపీలు రాజీనామా పై నిర్ణయం తీసుకొనేందుకు మళ్లీ ఢీల్లీకి రావాలని స్పీకర్ కోరారు..మే 29న స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలిసిన వైసీపీ ఎంపీలు రాజీనామాలను ఆమోదించాలని కోరారు. జూన్ 05, లేదా 6 తేదీల్లో వైసీపీ ఎంపీలు ఢిల్లీకి రావాలని స్పీకర్ పిలుపునిచ్చారు. అయితే రాజీనామాలను ఆమె ఆమోదిస్తారా..? లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here