టీడీపీ కి సవాల్ విసిరినా పీఏసీ ఛైర్మెన్ బుగ్గన …

29

టిడిపి నాయకులపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసిన పీఏసీ ఛైర్మెన్ బుగ్గన మాట్లాడుతూ.. టిడిపి నాయకులు తనపై చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయకపోతే రాజీనామాకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రానికి సంబంధించిన సమాచారాన్ని బిజెపి నాయకులకు చేరవేస్తున్నారంటూ ఆరోపణలు చేయడం సరైనది కాదని, పీఏసీ చైర్మన్ అయిన తనపై నిరాధార ఆరోపణలు చేయడం రాజ్యాంగ విరుద్దమని, తనపై ఆరోపణలు చేసిన కనకమేడల రవీంద్ర, యరపతినేని శ్రీనివాస్ పై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు.

YSRCP MLA Buggana Rajendranath Reddy Slams TDP Leaders

వైసీపీకి బిజెపికి సంబందాలు ఉన్నాయంటూ టిడిపి చేస్తున్న తప్పుడు ప్రచారాలు మానుకోవాలని, ఎపి భవన్లో లాగ్బుక్ ట్యాపరింగ్ చేయడం దేనికి సంకేతమని, తమపై బురద జల్లుతూ బీజేపీతో అంటకాగుతున్నది టీడీపీనే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు నిదర్శనం నిర్మలా సీతారామన్ భర్త చంద్రబాబు మౌత్పీస్ గా ఉండడమే అని, టిడిపి అభియోగలపై తేల్చుకునేందుకు తన ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మెన్ పదవులను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని, మరి మీరు సిద్ధంగా ఉంటే సవాల్ స్వీకరించాలని బుగ్గన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here