దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్(34) నిన్న ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటివరకు క్రికెట్లో ఎన్నో సరికొత్త విన్యాసాలను ప్రదర్శిస్తూ అవలీలగా బంతులను సిక్సర్లుగా మలిచే డివిలియర్స్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. మిస్టర్ 360 పేరున్న ఈ డివిలియర్స్ ఒకే సారి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నిజాయితీగా చెప్పాలంటే తాను అలసిపోయానని అయన అన్నారు.
ఈ మధ్య జరిగిన ఐపీఎల్లో తాను ప్రాతినిథ్యం వహించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇంటిదారి పట్టిన నాలుగు రోజుల అనంతరం ఏబీ ఈ కీలక నిర్ణయం తీసుకోవటం విశేషం. కానీ ఐపిఎల్ లో మాత్రం చక్కటి ప్రదర్శన చేసాడు ఏబీ .
అంతర్జా తీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగుతున్నట్లు ఏబీ వెల్లడించాడు. 123 టెస్టుల్లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించిన డివిలియర్స్ 22సెంచరీల సాయంతో 8765 పరుగులు చేయగా, 228 వన్డేలాడిన ఏబీ 25 శతకాల సాయంతో 8577 పరుగులు సాధించాడు. 78 అంతర్జాతీయ టీ20 లు ఆడాడు.