ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ జట్టు పరుగుల సునామీ

26

ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ జట్టు పరుగుల సునామీ సృష్టించింది. వన్డే క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అలెక్స్ హేల్స్ (92 బంతుల్లో 147; 16 ఫోర్లు, 5 సిక్సర్లు), జానీ బెయిర్ స్టో (92 బంతుల్లో 139; 15 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరోచిత సెంచరీలతో మంగళవారం జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 481 పరుగులు చేసింది. దీంతో 2016లో పాకిస్థాన్‌పై నెలకొల్పిన 444/3 స్కోరును అధిగమించింది. ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలోనే ఈ రెండు రికార్డులు రావడం విశేషం.

England smash 481/6 vs Australia to record highest ODI score

జాసన్ రాయ్ (61 బంతుల్లో 82; 7 ఫోర్లు, 4 సిక్సర్లు)తో తొలి వికెట్‌కు 159 పరుగులు జోడించిన బెయిర్‌స్టో.. హేల్స్‌తో రెండో వికెట్‌కు మరో 151 పరుగులు జత చేశాడు. చివర్లో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (30 బంతుల్లో 67; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) 21 బంతుల్లోనే అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో తక్కువ బంతుల్లో అర్ధశతం సాధించిన తొలి ఇంగ్లండ్ ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. అలాగే వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లండ్ ఆటగాడిగానూ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా హేల్స్, మోర్గాన్ నాలుగో వికెట్‌కు 124 పరుగులు జోడించి వరుస బంతుల్లో ఔటయ్యారు. రిచర్డ్‌సన్ 3, ఎగర్ ఒక్క వికెట్ తీశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here