ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ రోజు జరిగిన మొదటి ప్లే అఫ్ మ్యాచ్ లో రెండు వికెట్ తేజ తో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైసర్స్ హైదరాబాద్ జట్టు ఫై గెలిచింది. మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు . బాటింగ్ కి దిగిన హైదరాబాద్ జట్టు మొదటి బంతికే శిఖర్ వికెట్ కోల్పోయింది. ఆ తరువాత వెంట వెంటనే వికెట్ లు కోల్పోయిన హైదరాబాద్ ఒక దశ లో 100 లోపే ఆల్ అవుట్ అవుతుంది అని అనుకున్నారు.. కానీ చివర్లో బ్రాత్‌వైట్ చక్కటి ఇన్నింగ్స్ తో ఆకట్టుకొని మంచి స్కోర్ ని టీం కి అందించాడు.
కాగా నిర్ణిత 20 ఓవర్ల లో 139 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. 140 పరుగుల లక్షం తో భరి లోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ తక్కువ స్కోర్ ని కొట్టడం లో తడ బడింది. 33 కే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఒక వైపు వికెట్లు కోల్పోతున్న డు ప్లసిస్ నిలకడిగా ఆది జట్టుని గెలిపించాడు..ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే చెన్నై గెలిచి ఐపిఎల్ 2018 లో ఫైనల్ చేరుకుంది.