IPL 2018: Delhi Daredevils win by 7 wickets against Mumbai Indians
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈ రోజు ముంబై లోని వాఖండే స్టేడియం లో ముంబై ఇండియాన్స్ , ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు పోటి పడ్డాయి. టాస్ మరో సారి ఓడిపోయి బాటింగ్ కి దిగిన ముంబై ఇండియాన్స్. నిర్ణిత 20 ఓవర్లో 194 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత 195 పరుగుల లక్షం తో భరి లోకి దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ మొదట్లోనే, కెప్టెన్ గంభీర్ వికెట్ కోల్పోయింది …ఆ తరువాత ఓపెనర్ రాయ్ వీర విహారం చెయ్యగా రాయ్ కి తోడుగా రిషబ్ పంత్ మంచి పరుగులు చేసాడు.
91 పరుగుల తో రాయ్ అజేయంగా నిలిచాడు … మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు …ఈ విజయం తో ఈ లీగ్ లో మొదటి సారి ఢిల్లీ గెలిచింది …కాగా వరుసగా ముంబై కి ఇది మూడో ఓటమి …ముంబై లో క్రునల్ పాండ్య రెండు వికెట్లు ..ముస్తాఫిజూర్ ఒక వికెట్ తీసాడు.