గెలిచినా కింగ్స్ ఎలవన్ పంజాబ్

70
IPL 2018 Match 18 Kkr vs KXIP

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ రోజు మొదట జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు ఫై 9 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలవన్ పంజాబ్ జట్టు గెలిచింది…టాస్ ఒడి బాటింగ్ కి దిగిన కోల్ కత్తా నిర్ణిత 20 ఓవర్లో 191 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది..క్రిస్ లీన్ , రాబిన్ ఊతప్ప , దినేష్ కార్తీక్ పోరాటం తో మంచి స్కోర్ చేసింది కోల్ కత్తా…192 పరుగుల లక్షం తో భరి లోకి దిగిన పంజాబ్ జట్టు ఓపెనర్లు గేల్ , కేఎల్ రాహుల్ మంచి శుబారంభం ఇచ్చారు….కాగా ఆట మధ్య లో వర్షం తో చాలా సేపు మ్యాచ్ ఆగిపోయింది …తిరిగి స్టార్ట్ అయిన మ్యాచ్…మ్యాచ్ జరుగుతుండగా మళ్ళి ఇంకోసారి వర్షం రావటం తో డక్ వర్త్ లూయిస్ ప్రకారం పంజాబ్ 9 వికెట్ల తేడా తో గెలిచినట్లు ప్రకటించారు ..ఈ విజయం తో పంజాబ్ పాయింట్ల పట్టిక లో మొదటి స్తానం లోకి చేరుకుంది…అలాగే కోల్ కత్తా 3 వ స్తానం లో కొనసాగుతుంది ..

స్కోర్ బోర్డు వివరాలు :

కోల్ కత్తా బాటింగ్ : క్రిస్ లిన్ (74) , రాబిన్ ఊతప్ప (34) , దినేష్ కార్తీక్ (43) పరుగులు .

పంజాబ్ బౌలింగ్ : టై (2) , శరన్ (2) , రహమాన్ (1) వికెట్.

పంజాబ్ బాటింగ్ : గేల్ (62) , కేఎల్ రాహుల్ (60) పరుగులు .

కోల్ కత్తా బౌలింగ్ : నరైన్ (1) వికెట్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here