ట్రైలర్ తో అదరగొడుతున్న మెగా హీరో

34
Tej I Love You Theatrical Trailer Released

వరుస ఫ్లొప్ లతో సతమతం అవుతున్న మెగా హీరో సాయి ధరం తేజ్ . అయన తాజాగా నటిస్తున్న చిత్రం “తేజ లవ్ యు” కరుణాకరన్ దర్శకత్వం లో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ చిత్రాన్ని కే.ఎస్ రామరావు నిర్మించారు. గోపి సుందర్ సంగీతం అందించాడు. జూలై 6 న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇక పోతే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ఈ మధ్యనే రిలీజ్ అయ్యి మంచి స్పందన లబిస్తుంది. ఈ రోజు ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రకల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే రిలీజ్ చేసారు.

ఈ ట్రైలర్ ని చూస్తుంటే ఈ చిత్రం ఫై అంచనాలు ఇంకా పెరుగుతున్నాయి. ఈ చిత్రం లో సాయి ధరం తేజ్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది.. ట్రైలర్ ని చూస్తుంటే ఒక మ్యూజికల్ లవ్ స్టొరీ గా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్ర హిట్ ఇటు హీరో సాయి ధరం తేజ్ కి అలాగే డైరెక్టర్ కరుణాకరన్ కి ఎంతో అవసరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here